calender_icon.png 3 November, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ ఇష్టం వచ్చినోళ్లకు చెప్పుకోండి

03-11-2025 12:33:59 AM

  1. పట్టుకుంటే 5000 పైన్ అంతే వదిలేస్తారు?
  2. అక్రమ ఇసుక అంటూ అడ్డుపడితే మా పవర్ చూపిస్తాం
  3. దర్జాగా నెంబర్ ప్లేట్లు లేకుండా ట్రాక్టర్లతో ఇసుక సరఫరా
  4. ఎమ్మార్వో కాల్ చేస్తే... సీఐ కి కాల్ చేయమంటు సూచన
  5. అధికారం ఉంటే ఏదైనా నడుస్తదా...

జడ్చర్ల, నవంబర్ 2 : అధికారం ఎవరిదైనా పవర్ ఉన్నోడిదే పని అవుతుందా...? ఇది మాటల వరకే కాదు చేతల వరకు కూ డా కార్యరూపం దాల్చుతుందా... అన్యాలకు అక్రమాలకు మా నియోజకవర్గంలో తావులేదు అలా ఎవరైనా ఉంటే ఏ అధికారి అయిన ఉన్న సస్పెండ్ చేయిస్తాం... ట్రాన్స్ఫ ర్ చేయిస్తాం నియమ నిబంధనలకు లోబడి సామాన్య పౌరుడు నుంచి బడా బాబుల వరకు సమాన న్యాయం అందిస్తామంటూ నిరంతరం మైకు దొరికినప్పుడల్లా చెబుతు న్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేరు చె ప్పుకొని ఆక్రమ దందా లో పేరు సంపాదించుకున్న కొంతమంది వ్యక్తులు దర్జాగా అనుమతి లేకున్నప్పటికీ అక్రమ ఇసుక దం దా దర్జాగా చేస్తుండ్రు.

ఇదేమిటని ప్రశ్నిస్తే ఎమ్మార్వోకు ఫోన్ చేయమంటారా.. ఎస్త్స్రకి చేయమంటారా మరి ఎవరికైనా చేయమంటారా ? ఎవరైనా అడ్డుపడితే వారి సంగతి చూస్తామంటూ నేరుగానే బెదిరింపులకు పా ల్పడుతున్నారు. అధికారులు పట్టుకుంటే రూ 5000 పైన్ విధిస్తారు.. తర్వాత యధావిధిగానే మా పనులు మేము చేస్తామంటూ ఓ సినిమాలో ఒక హీరో ఈ సినిమా ఫె యిల్ అయిన హిట్ అయిన మరో సినిమా చేస్తామన్నట్టు ఇసుక అక్రమ వ్యాపారాలకు పక్క ప్రణాళికల రూపొందించుకొని అడుగులు వేయడం విశేషం. అధికారులకు తెలిసి న చూసి చూడనట్టు వ్యవహరించడం జడ్చర్ల పట్టణవాసులకు మింగుడు పడడం లేదని తెలుస్తుంది. 

 - అడ్డుపడి చూడండి...

 అక్రమ ఇసుక సరఫరా చేస్తున్నారని... ఇసుక ట్రాక్టర్లకు నెంబర్లు లేవని ఎవరైనా అడ్డుపడితే చూడండి... వారు ఏ గతి అవుతారో.. తమాషాలు చేస్తున్నారా? ఏమను కుంటున్నారు.. అంటూ జడ్చర్ల నియోజకవర్గం లోని జాతీయ రహదారి 167 లో గల కురువ గడ్డపల్లి దగ్గర బ్రిడ్జి కింద కొంతమంది ఇసుక వ్యాపారులు దర్జాగా అక్ర మంగా ఇసుక తరలింపు పాల్పడుతు.. ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతు న్నారని జడ్చర్ల మండల వాసులు చెబుతున్న మాట.

ఇక్కడ అక్రమ దందా గా మా రిన ఇసుక వ్యాపారం కూడా ఒక లెక్క ప్రకా రం జరుగుతుంది. నిబంధనలకు దూరంగా ఉండి ఎలా పడితే అలా ఇసుక సరఫరా చేస్తున్న వాహనాలకు అస్సలు నెంబర్ ప్లేట్లు ఉండవు. ఇక్కడ నింపుకొని ఎక్కడ పోతున్నారు వారికి తెలవాలి. ట్రాక్టర్లు లోడ్ అయిన తర్వాత ఆ వ్యాపారులు చరవాణిల ధర ఎక్కడికి సమాచారం అందిస్తే అక్కడికి వేగంగా తరలిస్తూ నెంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తూ పోవు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుం ది. అసలే అధికార పార్టీ పేర్లు చెబుతున్నారు మనకెందుకులే అనుకుంటూ జనం లోలోపలనే మదన పడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- సిఐ గారికి చెప్పండి.. తహసిల్దార్

 ఇటీవల అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్నారు.. నెంబర్ ప్లేట్లు కూడా లేవు ఆ ట్రాక్టర్లకు అంటూ సమాచారం ఇచ్చిన వ్యక్తులకు తాసిల్దార్ స్పందిస్తూ సీఐ కి సమాచా రం ఇవ్వండి మా సిబ్బందిని పంపిస్తాం అం టూ సమాధానమిచ్చారు. ఈ మేరకు సి బ్బందిని ఇసుక తరలింపు జరుగుతున్న ప్రాంతాల దగ్గరికి పంపించి ఆ ఇసుకను ఇందిరమ్మ ఇండ్లు తట్టుకునే వారికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నా రు.

ఇంత జరిగిన ఇది కొంతవరకు మాత్ర మే ఉంటుందని మరుసటి రోజు యధావిధి గానే ఇసుక అక్రమంగా తరలింపు జరుగుతుందని జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ చెబుతున్న మాట. ఈ విషయంపై అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఉంది.