02-08-2025 12:00:00 AM
బెంగళూరు, ఆగస్టు 1: కర్ణాటకలో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ క్లర్క్‌ను లోకాయుక్త అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (కేఆర్‌ఐడీఎల్)లో కలకప్ప నిడగుండి క్లర్క్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో అతని జీతం 15వేలు అయినప్పటికీ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణ లున్నాయి.
మాజీ కేఆర్‌ఐడీఎల్ ఇంజినీర్ చిన్చోల్కర్‌తో కలిసి కలకప్ప నికిలీ పత్రాలు, బిల్లులు సృష్టిం చి రూ. 75 కోట్లకు పైగా దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో లోకాయుక్త దాడు లు చేయగా.. దాదాపు 30 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. దా దాపు 24 ఇండ్లు, 40 ఎకరాల వ్యవసాయభూమి కలకప్ప పేరు మీద ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కలకప్పను లోకాయుక్త అధికారులు విచారణ చేస్తున్నారు.