calender_icon.png 6 August, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యా సమీపంలో అణు సబ్‌మెరైన్లు

02-08-2025 12:00:00 AM

ట్రంప్ ఆదేశాలు

న్యూయార్క్, ఆగస్టు 1: రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా సమీపంలో రెండు అణు సబ్‌మెరైన్ల మోహరింపునకు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు భారత్, రష్యా పతనమైన ఆర్థిక వ్యవస్థలుగా ట్రంప్ పేర్కొన డంపై మెద్వెదెవ్ స్పందిస్తూ.. ‘ది వాకింగ్ డెడ్’ చిత్రాలను గుర్తించుకోవాలని, అవి ఎం త ప్రమాదకరమో ఆలోచించుకోవాలన్నా రు. రష్యా.. ఇజ్రాయెల్ లేదా ఇరాన్ మాదిరి కాదని, తాము చేసే ప్రతి హెచ్చరిక కూడా ముప్పేనన్నారు. తాజాగా మెద్వెదెవ్ వ్యా ఖ్యలకు కౌంటర్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ట్రంప్ తన ‘ట్రూత్ ఎక్స్’లో పేర్కొన్నారు.