calender_icon.png 8 July, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా ఇసుక డంపు

08-07-2025 12:00:00 AM

విజయ క్రాంతి దినపత్రిక కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం 

మహబూబ్ నగర్ జూలై 7 (విజయ క్రాంతి) : జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ గ్రామపంచాయతీ లో గల కోడి పత్రి గ్రామ సమీ పంలో దుందుభి వాగుపక్కనే దర్జాగా ఇసుక డంపు అనే కథనం విజయ క్రాంతి దినపత్రిక సోమవారం ప్రచురితం చేసింది. ఈ మేరకు జడ్చర్ల రెవె న్యూ శాఖ అధికారులు సంబంధిత సిబ్బంది ఇసుక డంపు దగ్గరికి వెళ్లి పరిశీలించారు.

అక్రమంగా ఇసుక ఉందని తెలుసుకున్న సంబంధిత అధికారులు ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. ఇసుక డంపును సీజ్ చేయడం తో పాటు ప్రభుత్వ నిర్మాణ పనులకు వినియోగించుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తాసిల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు.