10-01-2026 12:00:00 AM
కుమ్రం భీం అసిఫాబాద్, జనవరి 9 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో శుక్రవారం ముందస్తుగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీ వాసవి హైస్కూల్ లో ముగ్గుల పోటీలతోపాటు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.వివిధ పాఠశాలల్లో కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కైట్స్ ఎగరవేశారు.ఈ కార్యక్రమలలో ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు,మహేశ్వర్,సిబ్బంది పాల్గొన్నారు.