27-12-2025 02:27:30 AM
స్కూళ్లకు ఐదు రోజులే హాలిడేస్..
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఐదు రోజుల పాటు ఇవ్వనున్నారు. 2025 విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వనున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల విడుదల సెలవుల జాబితాలో మాత్రం జనవరి 14న భోగి, 15న సంక్రాంతి నాడు జనరల్ హాలిడేస్‌గా ప్రకటించగా, 16( కునుమ)ను ఆప్షనల్‌గా ప్రకటించారు. దీంతో సంక్రాంతి సెలవులు 16వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంది. 17 శనివారం, 18 ఆదివారం కావడంతో 17న లేదా 19న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే అవకాశముంది. ఒకవేళ 16న సెలవు ఇవ్వకుంటే అదే రోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో విద్యాశాఖ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.