19-08-2025 12:20:33 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, ఆగస్టు 18: బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. సోమావారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని సెంటర్ లో చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, కొండ వెంకన్న గౌడ్. పన్నాల రాఘవరెడ్డి ,లింగాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో..
సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి కొప్పుల అంజయ్య , మండల అధ్యక్షుడు గుడుగుంట్ల బుచ్చి రాములుమండల కమిటీ సభ్యులు పొడిచేటి వీరయ్య పుట్ట జానయ్య పుట్ట ముత్తి రాములు చేతివృత్తుదారుల జిల్లా నాయకులు ఒంటపాక వెంకటేశ్వర్లు బండమీది ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ..
వలిగొండ,ఆగస్టు 18 (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని సుంకిశాల దాసిరెడ్డిగూడెం తదితర గ్రామాల్లో, తహసిల్దార్, ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆలేరులో..
ఆలేరు, ఆగస్టు 18 (విజయ క్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి 375 సోమవారం జయంతి సందర్భంగా ఆలేరు గౌడ భవనం లో పూలమాల ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య మాట్లాడారు 350 సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యాధికారం కావాలి నినందించిన సర్వే పాపన ఆశయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిందని అన్నారు. గీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్వే పాపన చాకలి, మంగలి, కుమ్మరి, కురుమ గొల్ల, దూదేకుల కుల ఐక్యం చేసి రాజులకు, దొరలు, భూస్వాములకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉందని కొనియాడారు.
కల్లుగీత పరిశ్రమక సహకార సంఘం అధ్యక్షుడు ఘనగాని శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి చేరుతున్నట్లు చెప్పారు శంకర్ గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గౌడ భవనకు 5 లక్షల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి పనుల నుండి కేటాయిస్తున్నట్లు బిర్లా ఐలయ్య చెప్పారు. మొరిగాడు చంద్రశేఖర్ ఐలయ్యకు విన్నవిస్తూ గీత కార్మికులకు చెట్లు ఎక్కే సందర్భంలో ఎందుకు రక్షణగా కిట్టును ఇవ్వాల్సిందిగా కోరారు అదేవిధంగా నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి గీత కార్మిక సొసైటీలను ఆ ఆదుకోవాలని కోరారు.
నూతన మద్యం పాలసీ కొరకు క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికుల రక్షణ కిట్ల కోసం ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు ఆలేరు నియోజకవర్గం గీతా కార్మికులకు రక్షణ కిట్లు అందజేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్యం సంజీవరెడ్డి, జన్మ ఉపేందర్ రెడ్డి తోపాటు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ కాంగ్రెస్ నాయకులు కట్టిగుమ్ముల సాగర్ రెడ్డి, గరగలి నరసింహులు, చంద్రమౌళి, మొరిగాడి మహేష్, శ్రీశైలం, దూడల రాజు, ఘనగాని యాదగిరి తదితరులు పాల్గొన్నారు.