19-08-2025 01:25:50 AM
ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 18 (విజయక్రాంతి) జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో సర్వాయి పాపన్న జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని గౌడ సంఘం అనుపురం ఎమ్మెల్యేకు గౌడ సంఘం సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. హైదరాబాద్ నడి బొడ్డున పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసుకోబోతున్నామని నేడు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు.
వివక్ష ఎక్కడ ఉన్నా ప్రశ్నిస్తూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. వివక్షను, అసమానత కోసం మొగలులను ఎదురించిన సర్వాయి పాపన్న గౌడ్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు గౌడ సంఘం పాలకవర్గం, సంఘ సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు గుర్రం విద్యాసాగర్, కత్తి కనకయ్య, అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు , బిజెపి నాయకులు ఎర్రం మహేష్, కాం గ్రెస్ నాయకులు కార్యకర్తలు , అనుపురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.