19-08-2025 01:27:57 AM
మంథని, ఆగస్టు18 (విజయ క్రాంతి) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి, మంథని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌడ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మంథని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు మాచిడి రవితేజ గౌడ్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పీఏసీ ఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ మండల అధ్యక్షులు అయిలి శ్రీనివాస్, మాజీ మండల యూత్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, అజీమ్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ ఆరెల్లి కిరణ్ గౌడ్ లు మాట్లాడుతూ పాపన్న మొఘలు సామ్రాజ్య నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడని,బడుగు బలహీన వర్గాలను కలుపు కొని గోల్కొండ కోటపైన బహుజన జండా ఎరవేసి, గోల్కొండ కోటను ఆస్థానంగా ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట నుండి పరిపాలించాడని, ఆయన అనేక కోటలను సామంత రాజులను జయించి, బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేశారని,ఆ మహనీయుని స్ఫూర్తితో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్ల నాగరాజు, మాజీ సర్పంచ్ దొరగొర్ల శ్రీనివాస్ యాదవ్, రాజిరెడ్డి, గట్టయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరెల్లి వరుణ్, ఎరుకల సురేష్, పోగుల సాగర్ గౌడ సంఘం నాయకులు టి.రాజు, పూదరి సమ్మయ్య గౌడ్, మాచిడి మోహన్, పోన్నం చంద్రయ్య, మాచిడి సదాశివ్, భీముని రాములు, మాచిడి లింగయ్య, కొండ్ర శ్రీనివాస్, వేగోల్లపు చిన్న శంకర్, తాటి శ్రీనివాస, ఆరెళ్ళి మల్లయ్య, మాచిడి కిష్టయ్య, తాళ్లపల్లి సత్యనారాయణ, మాచిడి బాపు, తాటి శ్రీదర్, తాటి శంకర్, మాచిడి బాపు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.