calender_icon.png 5 December, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిలిగిర్ పేట సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ షాబుద్ధీన్

05-12-2025 12:01:03 AM

* గ్రామ పెద్దలను సన్మానించిన జగ్గారెడ్డి

సదాశివపేట, డిసెంబర్ 4 :సదాశివ పేట మండలం మిలిగిరిపేట సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన  కాంగ్రెస్ పార్టీ నాయకుడు  షాబుద్దిన్ ను టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సన్మానించారు. షాబుద్దిన్ తో పాటు   ఏకగ్రీవానికి సహకరించిన గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, ఏషోబు, ఉషయ్య, హన్మం త రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, యా దయ్య, నారాయణ, సంజీవ రెడ్డి, దానయ్య, యాధుల్ లను జగ్గారెడ్డి సన్మానించారు. 

మిలిగిరి పేట గ్రామ అభివృద్దికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఏకగ్రీవానికి సహకరించిన మిలిగిరిపెట్ గ్రామస్థులకు  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జ్ జూలకంటి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, సిడిసి చైర్మెన్ గడీల రామ్ రెడ్డి, సదాశివపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దన్నపాల్గొన్నారు.