calender_icon.png 5 December, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

05-12-2025 12:02:19 AM

పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి

పటాన్ చెరు, డిసెంబర్ 4 :పటాన్ చెరు మండలం పరిధిలోని క్యాసారం గ్రామ పంచాయతీకి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా శ్రీకైల అనిత ప్రభాకర్ రెడ్డిని, భానూర్ గ్రామ పంచాయతీకి అభ్యర్థిగా ముత్తమొల్ల శ్రీనును పార్టీ తరఫున ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ వీరికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవలు, సంక్షేమం తమ లక్ష్యమని అభ్యర్థులు పేర్కొంటూ ప్రజల ఆశీస్సులు కోరాలన్నారు.

రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావాహులు ఎవరు కూడా నిరాశపడవద్దని, రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.