calender_icon.png 23 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ను కలిసిన జగ్గారెడ్డి

23-12-2025 12:00:00 AM

సంగారెడ్డి, డిసెంబర్ 22 : సంగారెడ్డి మైనారిటీ సమస్యలపై సోమవారం నాడు హైదరాబాద్ లోని వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భేటీ అయ్యారు. సంగారెడ్డిలో ముస్లిం మైనారిటీల కోసం ఖబ్రస్తాన్ కు నాలుగుఎకరాల స్థలం మంజూరు కోసం విజ్ఞప్తి చేశారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో తొందరగా దర్గా కమిటీలు వేయాలని కోరారు. ఈ భేటీలో నాయకులు హఫీజ్ షఫీ, కూన సంతోష్ పాల్గొన్నారు.