24-11-2025 01:20:15 AM
ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు డిప్యూ టీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీ అయిన అధికా రులు తక్షణమే తమ కొత్త పోస్టింగులలో బాధ్యతలు స్వీకరించాలని డీజీపీ ఆదేశించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీగా పనిచే స్తున్న ఎంవీ శ్రీనివాస్ రావును దేవరకొండ ఎస్డీపీఓగా నియమించారు. నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారిని సిరిసిల్ల ఎస్డీపీఓగా బదిలీ చేశారు.
ఇప్పటివరకు సిరిసిల్ల ఎస్డీపీఓగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీలో డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను ఖమ్మం జిల్లా వైరా ఏసీపీగా ఉన్న ఖాళీలో నియమించారు. బదిలీ అయిన అధికారులను వెంటనే వారి ప్రస్తుత బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, కొత్త పోస్టింగులలో చేరేలా చూడాలని సంబంధిత యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు.