calender_icon.png 23 November, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీపై సౌరాష్ట్ర ఘన విజయం

25-01-2025 12:00:00 AM

రాజ్‌కోట్: రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. గ్రూప్-డిలో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జడేజా ధాటికి ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులకే కుప్పకూలింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జడ్డూ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో గ్రూప్ నుంచి సౌరాష్ట్ర, తమిళనాడు నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఢిల్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (17) రెండో ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా నిరాశపరిచాడు.

ఇక జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై 188 పరుగుల ఆధిక్యంలో ఉంది. శార్దూల్ ఠాకూర్  (113*) అజేయ సెంచరీ సాధించగా.. తనుష్ (58*) అర్థసెంచరీ చేశాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ (28), జైస్వాల్ (26) మరోసారి నిరాశపరిచారు. జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌటైంది.