calender_icon.png 23 November, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా నుంచి ముగ్గురు

25-01-2025 12:00:00 AM

  1. ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 
  2. వన్డే జట్టులో మంధాన, దీప్తి

దుబాయ్: ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో టీమిండియా నుంచి ముగ్గురికి చోటు లభించింది. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జట్టులో ఉన్నారు. మొత్తం 11 మందితో కూడిన జట్టులో భారత్ నుంచి ముగ్గురు ఉండగా.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా, శ్రీలంక నుంచి ఒక్కరు చొప్పున చో టు దక్కించకున్నారు. 

కెప్టెన్‌గా పాట్ కమిన్స్ ఎంపికవ్వగా.. బ్యాటింగ్ విభాగంలో రూట్, విలియమ్సన్, బ్రూక్, జైస్వాల్, డకెట్, కమిందు మెండిస్‌లు ఉండగా.. వికెట్ కీపర్‌గా జేమీ స్మిత్ ఎంపికయ్యాడు. ఆల్ రౌండర్‌గా జడేజా, బౌలింగ్ విభాగంలో కమి న్స్, బుమ్రా, మాట్ హెన్రీ ఉన్నారు.

గ తేడాది టెస్టు క్రికెట్‌లో 71 వికెట్లు తీసిన బుమ్రా ఒక ఏడాదిలో అత్యధిక వికెట్లు తీ సిన బౌలర్‌గా నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ జడేజా 527 పరుగులతో పాటు 48 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో జైస్వాల్ గతేడాది క్యాలెండర్ ఇయర్‌లో 1478 పరుగులు సాధించాడు.

మంధాన, దీప్తికి చోటు..

ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత్ నుంచి స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మ చోటు దక్కించుకున్నారు. కెప్టెన్‌గా లారా వోల్వర్ట్ ఎంపికైంది. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చొప్పున, వెస్టిండీస్, ఆస్ట్రేలియా నుంచి ఒక్కరు చొప్పున చోటు దక్కించుకన్నారు.

ఇక పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత్ నుంచి ఒక్క ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేదు. కెప్టెన్‌గా చరిత్ అసలంక ఎంపికవ్వగా.. లంక నుంచి నలుగురు, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురు చొప్పున, వెస్టిండీస్ నుంచి ఒకరు ఎంపికయ్యారు.