calender_icon.png 9 August, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రీయ వ్యవసాయంతో ఆరోగ్యానికి మేలు

09-08-2025 01:54:07 AM

నంగునూరు, ఆగస్టు 8 : సేంద్రియ వ్యవసాయం వల్ల మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని యువ వ్యాపారవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పొలం బాట’ కార్యక్రమంలో భాగంగా బీ.ఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు రాజేశ్వర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో అధికంగా పురుగుమందుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలు పెరుగుతున్నాయన్నారు. విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్న రాజేశ్వర్ రెడ్డి తన పొలాన్ని విద్యార్థులు శిక్షణా కేంద్రంగా ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సేంద్రియ వ్యవసాయంపై మరింత అవగాహన పెంచాలని ఆయన ఆకాంక్షించారు. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం, సాగులో మెళకువలను విద్యార్థులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తోర్నాల ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.