calender_icon.png 9 August, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు

09-08-2025 01:52:27 AM

సంగారెడ్డి, ఆగస్టు 8 : శ్రావణమాస శుక్రవారం  సందర్భంగా వరలక్ష్మి వ్రత వేడుకలను సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో మహిళలు  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి సామూహిక వరలక్ష్మీ వ్రత వేడుకలను జరిపారు. మహిళలు ఇండ్లలో  అమ్మవారి విగ్రహాలను ఏర్పరచుకొని వివిధ రకాల పూలు, పండ్లు ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మహిళలు వాయినాలు ఇచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.