calender_icon.png 2 October, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్‌కు ఘన సన్మానం

02-10-2025 12:34:34 AM

మణుగూరు, అక్టోబర్ 1, (విజయక్రాంతి) : ప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన గద్దల రమేష్ నుబుధవారం హనుమాన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కార్య క్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమలరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ  నాయకులుమాట్లాడుతూ, రమేష్ చిన్న వయస్సులోనే నిబద్దతతో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి పొందటం గర్వకారణం అన్నారు.

రాష్ట్ర కన్వీనర్ గద్దల రమేష్ మాట్లాడుతూ, తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని, పదవి కేటాయింపుకు కృషి చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతంకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టించి పనిచేసిన వారికి తప్పక పదవులు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చే శారు.

అనంతరం జేఏసీ నాయకులతో కలిసి రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాదిగ చేసి రాష్ట్ర నాయకులు మోదుగు జోగారావు, దండోరా శ్రీను, దెపంగి. వెంటరమణ, తోకల శ్రీను, శానాగారపు. కుమారస్వామి, సుకనపల్లి. నాగరాజు,మంద కోటి, ఇడుమూరు. అశోక్, వేణు, కృష్ణ, నరసింహారావు, కాజీపేట కృష్ణ, తిరుపతి పాల్గొన్నారు.