27-09-2025 01:34:22 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్
హుస్నాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట న్యాయవాదులు మురళీమోహన్‌రావు, శ్రీకాంత్ ల బార్ లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయవాదులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... “75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అణగారిన వర్గాల న్యాయవాది అత్యున్నత స్థాయికి చేరి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అగ్రకుల దురహంకారానికి నిదర్శనం” అన్నారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ప్రవర్తన న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.