27-09-2025 01:33:11 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ,.
రేగొండ/భూపాలపల్లి సెప్టెంబర్ 26(విజయక్రాంతి):చాకలి ఐలమ్మ పోరాట పటిమ,పట్టుదలే స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతి ని పురస్కరించుకొని ఐడిఓసి కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన జయంతి వేడుకలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ త్యాగానికి, పోరాటానికి స్ఫూర్తి వీరనారి చాకలి ఐలమ్మ నిలిచారని తెలిపారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,జిల్లా వెంకుబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇందిర, నాయకులు పుణ్ణం రవి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట సెప్టెంబర్ 26 (విజయ క్రాంతి) నెక్కొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 137వ జయంతి సందర్బంగా రజక సంఘం ఏర్పాటు చేసుకున్న చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూమి కోసం భుక్తి కోసం దోపిడీ నుండి విముక్తి కోసం, చాకలి ఐలమ్మ చేసిన పోరాటం మరవలేనిదన్నరు, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డాక్టర్ పులి అనిల్, మండల అధ్యక్షులు బక్కి అశోక్, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు.
హనుమకొండ న్యూ శాయంపేట జంక్షన్ వద్ద..
హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ న్యూ శాయంపేట జంక్షన్ వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ లు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అదేవిధంగా మాచిదేవ ట్రస్ట్ భవనంలో వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి కూడా పూలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి దాయకమని, ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ సామాజిక అసమానతులకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, సత్యపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు సురేందర్, కుల సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు.
ములుగు, కన్నాయిగూడెం, సెప్టెంబరు 26 (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐల మ్మ గొప్ప పోరాట యోధురాలు,ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవా లని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జయంతి వేడుకలు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ , సంఘ నాయకులతో కలసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం ఎప్పటికీ మర్చిపోలేనిద న్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ స్మరించుకోవడం ద్వారా కొత్త తరాలు సమాజ నిర్మాణా నికి దిశా నిర్దేశం పొందుతాయిన్నారు. కన్నాయిగూడెం మండలంలో కూడా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం రజక సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించడం ద్వారా ఆమె త్యాగాలను స్మరించు కోవడం జరుగుతోందనీ తెలిపారు.
వీర నారి చాకలి ఐలమ్మ
మహబూబాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల విముక్తి కొరకు విరోచితమైన పోరాట పటిమ చాటి వీర నారిగా చాకలి ఐలమ్మ నిలిచిందని పలువురు వక్తలు కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి.
ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో లు చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి నివాళులుర్పిం చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షే మ శాఖ అధికారి శ్రీనివాస్ రావు, డిసిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ పిడి మధుసూదన రాజు, డీఏవో విజయనిర్మల, హార్టికల్చర్ అధికారి మరియన్న, వెటర్నటీ జిల్లా అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, జిల్లా అధికారు లు ప్రేమ్ కుమార్, వేముల సురేష్, దేశీ రామ్ నాయక్, శ్రీనివాసరావు, కృష్ణవేణి, శ్రీమన్నారాయణ రెడ్డి, పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు రాఘవరెడ్డి, రజక సంఘం నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కేసముద్రంలో..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ సర్పంచ్ సట్ల నరసయ్య, సట్ల వెంకన్న, కొలిపాక ఉమా శంకర్, బాబు, కాంపాటి మహేందర్, బండి లక్ష్మణ్ గోపి, సిపిఎం మండల కార్యదర్శి గోడిషాల వెంకన్న, బొబ్బాల యాకూబ్ రెడ్డి, సావిత్ర, జల్లే జయరాజు, నీరుటి జలంధర్, సోమరపు ఎల్లయ్య సారయ్య పాల్గొన్నారు.
కాటారం..
కాటారం (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పైడాకుల మహేందర్, పున్నం రాజయ్య, రాజు, శంకర్, సమ్మయ్య లతోపాటు మండల బిఆర్‌ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రామిళ్ళ కిరణ్ పాల్గొన్నారు.