09-07-2025 12:06:31 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 8(విజయక్రాంతి): మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు పగడ్బందీగా అమలు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అత్యంత మారుమూల గ్రామాలైన రేగోడు మండలం సిందోల్, లింగంపల్లి, తాటిపల్లి గ్రామాలను కలెక్టర్ సందర్శించి అక్కడ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మరియు ఇతర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రజలు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిర్మాణ పురోగతిని లబ్ధిదారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలని,తొందరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత శారీరక, పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఏవైనా జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు వస్తే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు చేయించుకోవాలన్నారు.