09-07-2025 12:06:14 AM
శేరిలింగంపల్లి, జూలై 8: మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేల బృందం మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహా చార్యులు బృందానికి స్వాగ తం పలికారు. ఈ సందర్బంగా తెలంగాణ శాసనసభ ,శాసన మండలి మందిరాలను చూపించి విషయాలను వివరించారు.
తదనంతరం శాసనసభలోని కమిటీ హాల్లో సమావేశమయ్యా రు. ఈ సమావేశంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విధి విధానాలు కాగ్ నివేదికలపై జరుపుతున్న చర్చల వివరాలు సమీక్షించుకు న్నారు. అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నుల గురించి, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా పథకాలు, జరుగుతున్న అభివృద్ధిపై పరస్పరం పీఏసీ చైర్మన్ గాంధీ వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ప్రత్యేక రాష్ట్రం ఉద్దేశ్యాలను, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఔన్నత్యం గురించి మేఘాలయ అసెంబ్లీ సభ్యుల బృందానికి సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చార్లెస్ పిన్గ్రోప్, ఎమ్మెల్యేలు శ్రీ లహ్క్మెన్ రింబుల్,రూపా ఏం.మార్క్, తదితరులు పాల్గొన్నారు.