19-07-2025 12:00:00 AM
జగదేవపూర్, జూలై 18: పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ పాఠాలు బోధిస్తున్న బడిపంతులు ఒక్కసారిగా కుప్పకూలి అస్వస్థతకు గురయ్యారు. గమనించిన పిల్లలు మిగతా ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన తోటి ఉపాధ్యాయులు హుటాహుటిన ఉపాధ్యాయుని ప్రాథమిక చికిత్స కు తరలించారు. పరీక్షించిన వైద్యుడు పరిస్థితి విషమించిందని సూచించారు.
కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయులు సోమచారిని హైదరాబాద్ కు తరలిస్తుండగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లికి చెందిన సోమాచారి (55) ఇదే మండలంలోని పీర్లపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం పాఠశాలలో పాఠాలు చెబుతుండగానే గుండెదడగా రాగానే అక్కడే కుప్పకూలడు. విధులు నిర్వహిస్తూ గుండెపోటు గురికావడం చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోమాచారికి భార్య పద్మ, నరేష్, సిద్దార్థ్ కుమారులు ఉన్నారు.