19-07-2025 12:00:00 AM
శిక్షణ తరగతిలో ఎంపీడీవో సత్తయ్య
కొండాపురం, జూలై 18: గ్రామ పంచాయతీల జాతీయ అవార్డుల కోసం కార్యదర్శులతో పాటు అన్ని శాఖల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కొండాపూర్ మండల అభివృద్ధి అధికారి సత్తయ్య తెలిపారు. శుక్రవారం కొండాపూర్ మండలం పరిషత్ సమావేశ మందిరంలో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సత్తయ్య మాట్లాడుతూ జాతీయ అవార్డుల కోసం అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే అంశంపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి అంశాన్నిఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. గ్రామపంచాయతీ చేపట్టిన వివిధ పనులను ఆధారంగా జాతీయ గ్రామ పంచాయతీ అవార్డులకు ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు.
గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రతి శాఖ నుండి ఒక గ్రామ పంచాయతీ సాధించిన లక్ష్యాలను వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిస్తే వాటి ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారని, గ్రేడింగ్ ఆధారంగా జాతీయ గ్రామపంచాయతీ అవార్డులకు ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో వీరప్ప, ఏపిఎం సరిత, ఆర్ డబ్ల్యూఎస్ అధికారి రవికుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్యామల, విమల, మెడికల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.