18-01-2026 01:04:56 AM
క్యాబినెట్ ముందుకు త్వరలో రానున్న అంశం
రెండేండ్లకోసారి 8 శాతం ఫీజుల పెంపునకు అంగీకారం
అంతకు మించితే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ముందుకు..
పాఠశాల విద్యాశాఖ సిఫారసులు
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): త్వరలో జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముందుకు ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లోని ఫీజుల అంశం రానుంది. ప్రైవేట్, కార్పొరేట్ బడుల్లో ప్రతి రెండేండ్లకోసారి 8 శాతం వరకు ఫీజుల పెంచుకోవచ్చు. రాష్ట్రస్థాయిలోని ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది. ఒకవేళ 8 శాతం ఫీజు మించితే స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించాలి. ఈ కమిటీ అన్ని రకాల విచారణలు జరిపి ఫీజులను ఖరారు చేస్తుంది. ఇవి రాష్ర్టంలోని ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ రూపొందించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలు. ఈతరహా లోనే మరికొన్ని రూపొందించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ఈ వివరాలను త్వరలోనే జరగనున్న రాష్ర్ట కేబినెట్ సమావేశం ముందుంచనుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు రానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఎట్టకేలకు చట్టం దిశగా..
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి ఎప్పటి నుంచో ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులను నియంత్రించాలని నిర్ణయించింది. కానీ, రెండేం డ్లయినా ఇది కార్యరూపం దాల్చకపోవడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫీజులను నియంత్రించేందుకు తెలంగాణ విద్యాకమిషన్ ద్వారా సర్కారు అధ్యయనం చేయించింది. విద్యా కమిషన్ పలు సిఫారసులు చేసింది. అంతే కాకుండా తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజీస్ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిట రింగ్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లులను సైతం తెలంగాణ కమిషన్ సిద్ధం చేసింది. 2025 మార్చిలో దీన్ని ప్రభుత్వానికి సమర్పించింది. అయితే మూడేండ్లకోసారి ఫీజులను సవరించాలని, రెండేండ్లకోసారి 10 శాతం ఫీజులను సవరించే అవకాశమివ్వాలని కమిషన్ సిఫారసు చేసింది.
జిల్లా, రాష్ర్టస్థాయిలో ఫీజు రెగ్యులేటరీ కమిటీలుండాలని సైతం సూచించింది. అయి తే పాఠశాల విద్యాశాఖ కమిషన్ చేసిన ఆయా సిఫార్సులను కొంత మేర మార్చింది. రెండేండ్లకోసారి ఫీజుల సవరణకు అవకాశమి వ్వగా.. పెంపుదలను 8 శాతానికే పరిమి తం చేసింది. ఇక రాష్ర్టస్థాయిలోనే ఎఫ్‌ఆర్సీ(ఫీజు రెగ్యులేటరి కమిటీ)ని సిఫారసు చేశారు. మొత్తంగా ఫీజుల నియం త్రణకు సం బంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. ఈ ప్రతిపాదనలను రాబోయే కేబినెట్ సమావేశం ముందుంచనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి ఆమో దం లభిస్తే త్వరలోనే చట్టం రానుంది. ఒకవేళ ఇది అమలైతే మాత్రం ఏండ్ల తరబడి ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లే.