calender_icon.png 14 November, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడి బాట

10-11-2025 12:00:00 AM

ఇంటికి బడి దూరం.. పక్కా అడవి బాట

దారిలో వాగులు వంకలు.. పచ్చని తోటలు

మా ఆకలి కడుపులకు రేగుపళ్లే ఆహారం

చిల్లుల అంగీనే మా వల 

చేపల పట్టి కాల్చుకుని ఒడ్డునే విందు

వెనువెంటనే ఈత సరదా

పడమటింట సూరీడు కుంగుతున్నప్పుడు 

ఇంటికి మా పయనం

ఏళ్లు గడిచినయ్

పొట్ట చేతిల పట్టుకుని 

పట్నాలకు పయనం

కానీ, నడిచిన బడి బాట ఎప్పుడు మదిలో పదిలం

గిడిచిన జీవితం 

యాదికొచ్చినప్పుడల్లా

నా కళ్లలో తడిరేఖల పొరలు

దోస్తుల యాదిలో గుండెల కన్నీటి వాన

 పద్మపుత్ర మల్లికార్జున్