28-01-2026 12:00:00 AM
204 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు
అండర్ 19 ప్రపంచకప్
బులవాయో, జనవరి 27 : అండర్ 19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. వరుస విజయాలతో టైటిల్ రేసు లో దూసుకెళుతున్న భారత్ తాజాగా జింబాబ్వేను 204 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. విహాన్ మల్హోత్ర సెంచరీతో కదంతొక్కాడు. 107 బంతుల్లో 109 పరుగులు చేశాడు. అ లాగే వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరిసాడు.
కేవలం 30 బంతుల్లోనే 52 పరుగు లు చేశాడు. వైభవ్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో అభిగ్యాన్ కుందు (61), పటేల్(30), అంబరీష్(21) పరుగుల తో రాణించారు. తర్వాత ఛేజింగ్‌లో జిం బాబ్వే చేతులెత్తేసింది. కీలక బ్యాటర్లు ఎవ్వ రూ క్రీజులో నిలవలేకపోయారు. లీరాయ్ (62) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ముగ్గురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. దీం తో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో ఉద్ధవ్, ఆయుశ్ మూడేసి వికెట్లు తీయగా.. అంబరీష్ 2 , హెనిల్, ఖినిల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ భారీ విజయంతో భారత్ యువ జట్టు ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరువైంది. ఈ మెగాటోర్నీలో భారత్‌కు ఇది హ్యాట్రిక్ విజ యం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకెళుతున్న భారత్ మ రొక్క మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్లో అడుగుపెడుతుంది.