20-05-2025 12:23:40 AM
పటాన్ చెరు, మే 19 : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని దుర్గా భవాన్ని మాత సహిత నాగలింగేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ పరిధిలోని వివిద కాలనీల ప్రజలు ఉత్సవాలలో భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల సత్యనారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కొల్లూరు గోపాల్, తలారి రాములు, శేఖర్, యాదగిరి, దాసు యాదవ్, మహాదేవ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.