calender_icon.png 22 May, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గనున్న డిగ్రీ సిలబస్!

20-05-2025 12:23:25 AM

-124 క్రెడిట్స్‌తో కొత్త సిలబస్

-త్వరలో వీసీల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి):  రాష్ర్టంలో డిగ్రీ కోర్సుల్లో ఈ విద్యాసంవత్స రం 2025 నుంచి కొత్త సిలబస్ అమలుచేయనున్నారు. కొత్త సిలబస్ పాత సిలబస్ కంటే తగ్గనుంది.

ఇప్పటివరకు డిగ్రీ కోర్సుల్లో క్రెడిట్ బేస్డ్ ఛాయిస్ సిస్టం(సీబీసీఎస్)లో 150క్రెడిట్స్‌తో కొనసాగుతుండగా.. ఇకపై దీనిని 120క్రెడిట్స్‌కే కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కొత్తగా రూపొందించిన నిబంధనల మేరకు ఇకపై మూడు సంవత్సరా ల డిగ్రీ కోర్సు పూర్తికావడానికి 120 క్రెడిట్స్ ఉండాలని సూచించింది.

ఈ నేపథ్యంలో కొత్త గా సిలబస్ మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఇప్పటివరకు 150 క్రెడిట్స్ ఉన్న వాటిని ఇకపై 124 క్రెడిట్స్‌గా కొనసాగించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. 

ఇప్పటికే యూనివర్సిటీలకు చెం దిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మన్లతో సంప్రదింపులు జరిపింది. క్రెడిట్స్ సంఖ్యపై మరోసారి వీసీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుల్లో ఆఖరి సంవత్సరంలో విద్యార్థి నేర్చుకోవల్సిన ప్రధాన సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. క్రెడిట్స్ ఉండేలాగా చూడాలని యూజీసీ సూచించింది.

ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లో ఇప్పటివరకు లాంగ్వేజెస్‌కి ఉన్న 20 క్రెడిట్‌ను కాస్త 12కు తగ్గించాలని భావిస్తోంది. వాటితోపాటు ఎలెక్టివిస్(డీఎస్‌ఈ)లో ఇప్పటివరకు కొనసాగిన 30 క్రెడిట్స్ స్థానంలో 22 క్రెడిట్స్‌కు తగ్గించాలని భావిస్తున్నారు. దీంతో గతంలో ఉన్న 150 క్రెడిట్స్‌ను కాస్త ఇప్పుడు 124కి తగ్గించాలని భావిస్తున్నా రు.

అయితే ఈ క్రెడిట్స్ లో 124 కాకపోతే 130వరకైనా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోసారి బీవోఎస్ ఛైర్మన్లతో చర్చిం చి ఆ తర్వాత వర్సిటీ వీసీలతో చర్చించి తుది నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి తీసుకోనుం ది. యూజీసీ ఇప్పటికే జారీచేసిన నిబంధనల మేరకు ఇకపై మూడేళ్ల డిగ్రీ కోర్సుకు 150క్రెడిట్స్ ఉండవు. కొత్తగా రూపొందించబోయే సిలబస్ 124 నుంచి 130 క్రెడిట్స్‌కు అనుగుణంగా సిద్ధం చేయనున్నారు.