21-07-2024 10:02:10 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగా బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమని పేర్కొన్నారు. ముఖ్యంగా నగరంలో సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు మరీ మనకు ప్రత్యేకమన్నారు. రాష్ట్రం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.