calender_icon.png 23 August, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

22-08-2025 07:14:23 PM

పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల, గ్రామాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం, తోగ్గూడెం గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పనుల జాతర 2025 కార్యక్రమాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి, ఉపాధి భరోసా ద్వారా పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాలు నిర్మించుకోవాలని సూచించారు. రైతులు హార్టికల్చర్,ప్లాంటేషన్ ఫారంపాండు నిర్మాణాలు ఊట కుంటలు పొలాలకు బాటలు వేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.