calender_icon.png 24 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధే మెరుగైన మార్గం!

22-11-2025 12:00:00 AM

చిటికెన కిరణ్ కుమార్ :

ప్రపంచం అభివృద్ధి వైపు పరుగు లు తీస్తుంటే మనిషి జీవితాన్ని నడిపే ఉద్యోగం మాత్రం నిలిచిపోయిన అడుగులుగా కనిపిస్తున్నాయి. పాఠశాల నుంచి డిగ్రీ స్థాయి వరకూ చదువులు పె రుగుతున్నా, ఉద్యోగం చేయాలనే ఆశలు పెరుగుతున్నా, ప్రపంచాన్ని మార్చేందుకు యువశక్తి ముందుకు వస్తున్నా.. ఆ విద్య కు, చేస్తున్న కృషికి తగిన ఫలితాలు అందక రోజురోజుకు ఆందోళన పెరిగిపోతుంది.

ఆలోచనల్లో వేగం పెరిగినా, అవకాశాల్లో మాత్రం వెనుకడుగు పడుతుందనేది ఆధునిక సత్యం. అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వర కూ నిరుద్యోగం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. డిజిటల్ యుగంలో అ డుగుపెట్టినా.. మనకు అవసరమైన ఉపాధిని మాత్రం యంత్రాలే దోచుకుంటున్నా యనే భావన ఎక్కువవుతోంది. ఉద్యోగం కోసం కొన్ని వేల దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతుంటే..  ఉద్యోగాల సంఖ్య మాత్రం వంద ల్లో కూడా ఉండడం లేదు.

జనాభా పెరుగుదల, మారుతూ వస్తున్న సాంకేతికత, విప్లవాత్మక మార్పులు, విద్య, ఉద్యోగాల మధ్య ఉన్న అసమతుల్యత లాంటి అంశాలు ఈ పరిస్థితిని నిర్మించా యి. ఉద్యోగానికి కేవలం చదువు ఉంటే చాలు అన్న రోజులు ఇప్పుడు లేవు. అనుభవం, నైపుణ్యానికి తోడు కొత్త టెక్నాల జీ పై అవగాహన, ఇంగ్లీష్ సంభాషణ వంటి ప్రమాణాలు చాలా అవసరం.

ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నా, ఆ రంగం వెలుపల ఉన్న కోట్లమంది యువత మాత్రం సరైన మార్గంలో నడవడానికి అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురు చూ స్తున్నారు. ఉద్యోగం దొరక్కపోతే ఆత్మవిశ్వాసం తగ్గి నిరాశ పెరిగి కుటుంబం మీద భారం పెరి గిపోతుంది. నిరుద్యోగం అనేది ఇవాళ  ఆ ర్థిక సమస్యగానే గాక సామాజిక సమస్యగానూ మారిపోయింది.

మానసిక కుంగుబాటు..

అదీగాక దేశంలో ఒక కాలేజీ నుంచి వేల మంది ఉద్యోగాల ఆశతో బయటికి వస్తే, వాళ్లకు సరిపడా ఉద్యోగాలు సృష్టించడమనేది ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారింది. సరైన ఉద్యోగం లేక చాలా మంది యువత బతుకు జీవనం కోసం చిన్నాచితక పనులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. వారు చేస్తున్న పని చదువుకు తగి నది కాదు, అలాగే అది వారి ఆశలకు సరిపోదు. విదేశీ ఉద్యోగాల కోసం కూడా వేలాది మంది వెళుతున్నారు.

కాని అక్కడ కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ఈ నిరుద్యోగం సమస్యే ఇవాళ దేశాల మధ్య ఆర్థిక తేడాలను స్పష్టంగా చూపిస్తున్నది. విద్యాసంస్థల్లో సబ్జెక్టుల నుంచి నేర్చుకునే విష యాలకు, కంపెనీలు కోరే నైపుణ్యాలకు మధ్య పొంతన లేకపోవడంతో ఇవాళ కుప్పలుతెప్పలుగా డిగ్రీ సరిఫికెట్లతో బయటకు వస్తున్న విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం గగనంలా తయారయ్యింది. దీని ఫలితంగా చదువుకున్న వారిలో ‘ఓవర్ ఎడ్యుకేషన్’ సమస్యగా కూడా పెరిగిపోతుంది.

చదివింది ఎక్కువ.. చేసే ఉద్యోగం చిన్నది కావడంతో మానసికంగా చాలా మంది కుంగుబాటుకు లోనవుతున్నారు. మరోవైపు వృత్తికి తగ్గ విద్య ఉన్నా నైపు ణ్యం లేకపోవడంతో డిగ్రీలు ఉన్న నిరుద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి తోడు వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, హస్తకళలు వంటి రంగాల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఈ రంగాలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఉపాధి కూడా తగ్గిపోయింది.

ఫలితంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పట్టణాలకు పరుగులు తీస్తున్న క్రమంలో గ్రామాలు ఉపాధి లేక వెలవెలబోతున్నాయి. నిరుద్యోగం దేశ ఆ ర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనడంలో సం దేహం లేదు. ఉద్యోగం కోసం చదువు, ఆ చదువు కోసం ఖర్చు, ఆ ఖర్చు కోసం అ ప్పులు, ఆ అప్పులు చెల్లించలేక కుటుంబాలకు ఇబ్బందులు.. ఇలా ఒక ఉద్యోగం లే కపోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. 

ఉపాధికి కొత్త దారులు..

అయితే ఉద్యోగం లేదని బాధపడకుండా నిరుద్యోగులు తమకు తాము కొత్త దారులు వెతుక్కొని ఉపాధి కల్పించుకోవాల్సిన అవసరముంది. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇలాంటి దారులనే వెతుకుతున్నాయి.స్టార్టప్‌లకు ప్రోత్సాహం, నైపు ణ్యాభివృద్ధి, డిజిటల్ రంగం విస్తరణ, గ్రామాల్లో చిన్న పరిశ్రమల పెంపు, మహిళల ఉపాధికి వసతులు ఇవన్నీ మార్పుకు సంకేతాలు. ఆవిష్కరణలతో కూడిన పరిశోధనలు చేసేందుకు యువతకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారిని ప్రోత్సహించాలి.

స్వయం ఉపాధి అంటే చిన్నచూపుగా చూడకుండా, అది కూడా ఒక గొప్ప మార్గమని అంగీకరించేలా యువతకు దిశానిర్దేశం చేయాలి. యువతను ఉద్యోగాలకు సిద్ధం చేయడంతో పాటు, వారు కొత్త ఉద్యోగాలను సృష్టించే వ్యవస్థాపకులుగా నిలిచేలా తయారు చేయాల్సిన అవసరముంది. చదువుతో సంబంధం లేకుండా ప్రపంచంతో పోటీపడే నైపుణ్యాలను నేర్చుకొని ఉపాధి సా ధించే స్థాయికి ఎదగాలి.  ప్రస్తుత కాలంలో డిజిటల్, గ్రీన్ ఎనర్జీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అధిక అవకాశాలు ఉన్నాయి.

వాటికి కావాల్సిన శిక్ష ణ అందించాలి. నిరుద్యోగం అనే సమస్య ను కేవలం ప్రభుత్వాలు లేదా పరిశ్రమ రంగాలు మాత్రమే పరిష్కరించలేవు. అయితే కుటుంబాలు, విద్యాసంస్థలు, కంపెనీలు, ప్రతీ వ్యక్తి కలిసి పని చేస్తేనే మార్పు కనిపిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నప్పటికీ ఆ అభివృద్ధి ఫలితాలు అందరికీ చేరడం లేదని స్పష్టం గా తెలుస్తోంది.

చాలా దేశాల్లో పరిశ్రమలు పెరుగుతున్నాయి కానీ యంత్రాలు, రోబోల వినియోగం పెరగడంతో మనుషుల అవసరం తగ్గిపోతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లభాం అనే విధానాన్ని ఆయా సంస్థలు లక్ష్యంగా పెట్టుకోవడం, ఉద్యోగాల కంటే ఆటోమేషన్‌కే ప్రాధాన్యతను ఇస్తుండడం కూడా నిరుద్యోగం పెరగడానికి కారణమవుతోంది.

మార్కెట్‌కు అనుగుణంగా..

ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య అన్నిచోట్లా ఒకేలా ఉండదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) నివేదిక ప్రకారం 2024లో మొత్తం గ్లోబల్ నిరుద్యోగ రేటు సుమారు 5 శాతంగా ఉంది. గత సంవత్సరాలతో పోల్చి చూస్తే ఇది తక్కువగా ఉండడం కాస్త అనుకూలమని చెప్పొచ్చు. సాధారణంగా అభివృద్ధి చెంది న దేశాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశాలు ఉండడంతో అక్కడ నిరుద్యోగం రేటు తక్కువగా ఉండవచ్చు.

కానీ అభివృద్ధిలో బాగా వెనుకబడిన ఆఫ్రి కా దేశాల్లో  నిరుద్యోగం తారాస్థాయికి చేరుకోవడంతో అక్కడి యువత డ్రగ్ కల్చర్‌కు బానిసలుగా మారిపోతున్నారు. నైజీ రియా, ఉగాండ, ఘనా లాంటి దేశాలే ఇం దుకు నిదర్శనం. ఈ విధానంలో మా ర్పు వచ్చిన రోజునే నిరుద్యోగం అనేది పూర్తిగా అంతమవుతుందేమో చూడాలి. మొత్తంగా ప్రపంచ ఉపాధి రంగం ఓ మా ర్పు దశలో ఉంది. నిరుద్యోగం అనే ఈ సమస్యను కేవ లం సంఖ్యాపరంగా చూడకుండా మన జీవితం మీద పడిన నీడగా గుర్తించాలి. 

భవిష్యత్ నిర్మాణం కోసం..

యువతలో ఉన్న సృజనాత్మకత, నైపు ణ్యం, కొత్త ఆలోచనలే రేపటి ఉద్యోగాలకు పునాదిగా నిలుస్తాయి. అందుకే విద్యను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చడం, నైపుణ్య శిక్షణలను పెంపొందించడం, స్టార్టప్‌లకు మద్దతు అం దిం చడం, చిన్న పరిశ్రమలకు కొత్త ఊపునివ్వ డం అత్యవసరం. పట్టణాల మాదిరిగా గ్రా మాల్లో ఉండే నిరుద్యోగ యువతకు ఉ పాధి లభించేలా పరిశ్రమల స్థాపను ప్రభుత్వాలు నడుం బిగించాలి.

ఉద్యోగం దొర కడం మాత్రమే లక్ష్యం కాదు, కొత్త ఉద్యోగాలను సృష్టించే స్వయం ఉపాధులుగా ఎదగడమే నిజమైన పరిష్కారం. నైపుణ్యాలతో, ధైర్యంతో ముందడుగు వేసే ప్రతి యవకుడు తనకే కాదు.. సమాజానికే వెలుగునిచ్చే శక్తి. అందుకే ఆశలను రెక్కలు చేసి, అవకాశాలను విస్తరించి, నిరుద్యోగం అనే సవాలును విజయానికి మెట్టును చేయాలి. ప్రపంచ అభివృద్ధిలో ప్రతి యు వతకు స్థానం ఉండే సమాన భవిష్యత్తును నిర్మించడం మన చేతుల్లోనే ఉంది. 

 వ్యాసకర్త సెల్: 9490841284