calender_icon.png 25 December, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాప్టిస్ట్ చర్చిలో సెమీక్రిస్మస్ వేడుకలు

25-12-2025 12:03:54 AM

కోదాడ, డిసెంబర్ 24(విజయ క్రాంతి) : క్రిస్మస్ పర్వదినం క్రైస్తవుల జీవితాల్లో వెలుగులు నింపాలని టీపీసీసీ డెలికేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. బుధవారం కోదాడ నయానగర్ బాప్టిస్ట్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు, నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు.

సమాజంలో శాంతి సామరస్యాలు క్రైస్తవుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్న పాస్టర్ యేసయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కాప్షన్ సభ్యురాలు జానకి యేసయ్య, చర్చి పాస్టర్ యేసయ్య, గిరిజన ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు బానోతు జగ్గు నాయక్, రిటైర్డ్ సిఐ శ్యామ్, మోజెస్, స్టీఫెన్, శారా, కిషన్ శ్రీనివాసచారి,యు నోస్, తిమోతి పాల్గొన్నారు.

వాగ్దేవి స్కూల్‌లో 

హుజూర్ నగర్, డిసెంబర్ 24(విజయ క్రాంతి) : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని స్కూల్ డైరెక్టర్స్ జాల జ్యోతి బాబు, నిడిగొండ గంగాధర్ అన్నారు. బుధవారం పట్టణంలోని శ్రీ  వాగ్దేవి హై స్కూల్  నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ...  విద్యార్థులకు చిన్ననాటి నుండే, అన్ని పండగల ప్రాముఖ్యతను తెలియచేయడానికి పాఠశాలలో ప్రతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.  అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి మిఠాయిలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగ లక్ష్మీ, మౌనిక, స్వతంత్ర, సుష్మా, కళ్యాణి, రుక్సన,నాగ మనోజ్ఞ, గృహలక్ష్మి, సునీత, ఉపేంద్ర,ఇంద్రజ,పుష్ప, తదితరులు,పాల్గొన్నారు.

ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో 

చిట్యాల, డిసెంబర్ 24(విజయ క్రాంతి):  నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను  విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం  ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు .

క్రీస్తు జననం, మానవాళికి ఆయన అందించిన సందేశంతో పాటుగా, శాంతి, ప్రేమ, ఆదరణలపై యేసు ప్రభువు ప్రపంచానికి చాటిచెప్పిన అంశాలను విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పెద్ది పద్మ, నమ్ముల ఆనందకుమార్, షేక్ షమీం, ఎస్ జ్యోతి, ఎం ధనలక్ష్మి, పి రమాదేవి, ఎన్ మాధవి, సుబేదా, ఏ మౌనిక, ఆసియా, సంపూర్ణ, స్వప్న, లింగస్వామి, కీర్తి, తదితరులు పాల్గొన్నారు.