calender_icon.png 25 December, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళ్లూరి వెంకన్న మరణం తీరనిలోటు

25-12-2025 12:06:11 AM

వెంకన్న కుటుంబానికి డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ రూ. 10 వేలు సాయం

నకిరేకల్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ దినపత్రిక విలేఖరి తాళ్లూరి వెంకన్నగతకొన్నిసంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ గురువారం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ లోని పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ వెంకన్న చిత్ర పటానికిని వాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వెంకన్న కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకన్న మరణం జర్నలిజం రంగానికి తీరనిలోటని,వెంకన్న కుటుంబాన్ని భవిష్యత్తులో అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీఇచ్చారు. కార్యక్రమంలో నోములజనార్ధన్,బాకీ వెంకన్న, చెవుగోనిశంకర్,చిల్లంశెట్టి,శ్రీను,నోములశంకర్,యంగలిగోపి,ఆలేటినరేష్,గండమళ్ళ నగేష్, యల్మకంటి హరీష్, గణేష్, కొడిమాల శంకర్,బండారు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.