23-05-2025 12:02:45 AM
మద్యం తాగి, వాహనం నడిపి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడేవారిలో ఎక్కువ మంది 18 ఏళ్లలోపు యువకులే ఎక్కువ మంది ఉంటున్నారు. మద్యం తాగి వాహనం నడిపి కొందరు తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా, అమాయక ప్రయాణికుల ప్రాణాలనూ బలిపెడుతున్నారు. పండుగలు పబ్బాల సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఎంతో మంది మరణిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రిళ్లు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలి. పిల్లలకు విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలి.
మైనర్లు డ్రైవింగ్ చేస్తుంటే, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమంలో భాగంగా పాఠశాలలు, కార్యాలయాలు, కాలనీల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మ,
విశ్రాంతి ప్రిన్సిపాల్, హైదరాబాద్