02-08-2025 09:15:00 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ కర్నె రవి 30వ వర్ధంతిని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి కర్నే రవి స్మారక స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. పత్రికా రంగంలో ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు.