18-05-2025 12:00:00 AM
-ఎమ్మెల్యేకు వృద్ధురాలు ఫిర్యాదు
ముషీరాబాద్, మే 17 (విజయక్రాంతి): సారూ.. నడవలేకపోతున్నా. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా పింఛన్ వస్తలేదు. అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోవడం లేదు. మీరైనా పిం ఛన్ ఇప్పించండి అని భోలక్ ప్పూర్ డివిజన్ బొంతల బస్తీకి చెందిన ఎం. మల్లమ్మ అనే వృ ద్దురాలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది.
స్పందించిన ఎమ్మెల్యే అమ్మ బాధపడకు నేను ఎమ్మార్వోతో మాట్లాడి పింఛన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ హయాంలో అర్హులైన వృద్ధులందరికి పింఛన్లు వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పింఛన్లు తొలగించడంతో పాటు అర్హులకు పింఛన్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.