calender_icon.png 6 May, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 1 నాటికి 7 తహసీల్దార్ కార్యాలయాలు పూర్తి

09-04-2025 01:47:38 AM

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ఏప్రిల్-8 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌పై సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిం చారు.

ఈ సందర్భంగస్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన 7 తహసిల్దార్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని, రాబోయే జనవరి 1,2026 నాటికి నూతన తహసిల్దార్ కార్యాలయాల ప్రారంభోత్సవం కావాలని అన్నారు. మంథని పట్టణంలో 4.5 కోట్లతో చేపట్టిన సమీకృత కార్యాలయాల సముదాయం పనులను రాబోయే ఉగాది నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి  పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకొని6 రావాలని అన్నారు. ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, డి. ఆర్.డి.ఓ.కాలిందిని పాల్గొన్నారు.