09-10-2025 12:00:00 AM
పలుమార్లు మొరపెట్టుకున్నా చర్యలు శూన్యం
అలంపూర్, అక్టోబర్ 8 : మానవపాడు మండల కేంద్రంలోని ఎస్సీ వాడలో మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా అందించే త్రాగునీరు గత నెలరోజుల నుంచి రాకపోవడంతో తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల కోసం వీధుల వెంబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.వేసవి రాకముందే నీళ్ల కష్టాలు మొ దలయ్యాయని వాపోతున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఏంటని ఆవేదనకు గురయ్యారు. గుక్కెడు మంచినీళ్ల కోసం బిందెలు చేత పట్టుకుని రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత మిషన్ భగీరథుల అధికారులకు మొరపెట్టుకున్న వారి తీరు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. గతంలో ఒక మోస్తారుగా వచ్చే నీళ్లు ... ఇప్పుడు పూర్తిగా బిందుకే పరిమితమైం దని వాపోతున్నారు.
కనీసం వంట చేసుకునేందుకు కూడా మంచినీళ్లు దొరకట్లేవు అని గత్యంతరం లేక వయసు మళ్ళిన ముసలోళ్ళు, మహిళలు ఖాళీ బిందెలు తీసుకొని రోడ్డుపై పారే ఉప్పు నీళ్లు తెచ్చుకుంటున్నామని వాపోయారు. కాలనీ లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు కాలువలలో త్రా గునీరు పైపులైను ఏర్పాటు చేయడంతో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు. సం బంధిత ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.