calender_icon.png 20 May, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివరేజ్ పైప్‌లైన్ పనులు ప్రారంభిస్తాం

20-05-2025 12:00:00 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మే19 (విజయక్రాంతి): త్వరలో రూ.1. 29 వ్యయంతో గాంధీనగర్ డివిజన్ లో మంచినీటి, సేవరేజి నూతన పైప్ లైన్ల పనులు ప్రారంభిస్తున్నామని  కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో  జరిగిన విలేకరుల సమావేశంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ మాట్లాడారు.

త్వరలో గాంధీనగర్ డివిజన్ లోని గోల్కొండ చౌరస్తా నుండి ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వరకు, టీఆర్‌టీ బస్తీ దవాఖానా, ఆంధ్రకెఫ్ సమీపంలోని నిమ్కర్ బిల్డింగ్, వి వి గిరి నగర్ బస్తి,అరుంధతి నగర్ బస్తిల వద్ద రూ. 1కోటి 29 లక్షల, బోర్డు నిధులతో నూతన మంచినీటి, సేవరేజి పైప్ లైన్ నిర్మాణం పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు.

గత కొంత కాలంగా డివిజన్ లోని ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా సమస్యను దృష్టి లో పెట్టుకొని కేంద్ర మంత్రి  జి. కిషన్ రెడ్డి  సహకారంతో జలమండలి ఎండి పై వత్తిడి తెచ్చి నిధులను మంజూరు చేయించామని తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రా బాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వి నయ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.