calender_icon.png 29 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబార.. కొత్త ప్రపంచం

29-01-2026 12:59:54 AM

దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రేమ్‌చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించారు. బుధవారం హైదరాబాద్‌లో ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ పేరుతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. “శబార’ అంటే ప్రపంచం.. ప్రేమ్‌చంద్ సృష్టించిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది.

ఈ చిత్రానికి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది. నేను ఇంత వరకు 8 సినిమాలు చేశాను. మొదటిసారిగా ఓ మనిషి మీద నమ్మకం పెట్టుకుని ప్రేమ్‌చంద్ కోసం ఈ మూవీ చేశాను” అన్నారు. దర్శకుడు ప్రేమ్‌చంద్ మాట్లాడుతూ.. “మా నాన్న నాకు దేవుడి కంటే ఎక్కువ. ఆ నాన్ననే ఎదురించి తీస్తున్నానంటే.. ఎలాంటి సినిమా తీస్తున్నానో అర్థం చేసుకోండి. సినిమానే అంతా మాట్లాడుతుంది. నచ్చింది చేయడమే జీవితం” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్రితిక సింగ్, మీషా నారంగ్, మిగతా మూవీటీమ్ మాట్లాడారు.