13-10-2025 12:00:00 AM
వారి కనుసన్నల్లోనే అన్ని పనులు
సారు సేవలో ఆ ముగ్గురే.. సర్వాధికారాలు వారివే
క్యాడర్, లీడర్లు నిమిత్తమాత్రులే
ఇంటాబయట అసంతృప్తులు
ఆ ముగ్గురిపైనే క్యాంప్ ఆఫీసులో గుసగుసలు
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 12 : ఎక్కడైనా ప్రతి నియోజక వర్గంలో ఎమ్మెల్యే ఒక్కరే ఉంటారు... కానీ బెల్లంపల్లిలో మాత్రం ము గ్గురున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం ఏంటనీ అనుకుంటు న్నారా? ఇదే యావత్ నియోజవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులను సైతం వేధిస్తున్న ప్రధాన ప్రశ్న... వారి కనుసన్నల్లోనే పనులు జరుగుతాయి. పనులంటే అభివృద్ధికరమైనవేమీ కావు.. సారును సం తోష పెట్టే పనులు కొన్నింటాయ్.
ఈ పను ల్ని ఆ ముగ్గురే చూసుకుంటారు. ఆ ముగ్గురి ప్రసన్నం ఎవరికైనా తప్పని సరి. ఎవరి పనులు వారు చేసుకోకుండా ఒకరి కోసం మరొకరూ.., పరస్పర సంతోశం కోసం వారి మధ్య నెట్వర్క్ అంతబలంగా ఏర్పడింది... వారి అన్యోన్యత, అనురాగాలు అలా పెనవేసుకుపోయాయి. నియోజక వర్గంలో అందరి దృష్టి వారిపైనే..
ప్రదాతలు.. వారూ..?
నియోజక వర్గంలో ఎవరికి ఏ పనైనా ఆ ముగ్గురి ప్రమేయం లేకుండా జరగదంతే.. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలి కదా... ఇక్కడ అంతే ఎం ఎల్ ఏ చెప్పినా వీరి దయ లేనిదే ఏం జరుగదు... ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు ఉద్యోగాలు, రకరకాల పైరవీలు, ఇలా వారితో కానివీ అంటూ ఏమీ ఉండవు.. చిన్నాచితుకా మొదలుకొని అన్ని పనులూ తమ కనుసన్నల్లోనే జరిగిపోతాయి.
నియోజక వర్గంలోని రక్షణ, సం క్షేమ, పరిపాలన శాఖలు ఇలా ఏ రంగమైనా వారికి టచ్ లోనే ఉంటాయి. సకల ప్రభుత్వ రంగాల శాఖల అధికారులు అనునిత్యం వారికి ఫోన్లో రెగ్యులర్ సంబంధాల్లో మెదులుతారు. అంతే కాదూ పనుల ప్రాధాన్యత, అవసరాన్నీ బట్టీ నేరుగా కూడా వెళ్ళి కలుస్తారు. వారు వెళ్లిన ఆఫీసుల్లో ఎగ్జిక్యూటివ్ కు ఇచ్చే రాచమర్యాదల్కేమీ తక్కువేమీ ఉండవు.
సార్ ప్రతినిధులు కదా.. వారికి ఎంతో గౌరవం ఇవ్వడం అధికారుల విధి ధర్మం. వారు చెప్పే పనులు తూ.చా. తప్పకుండా చేసి పెడతారు. అలా ఎవరైనా తక్కు వ చేసినట్టు కనిపిస్తే వారికి బొమ్మ చూపిస్తారు కూడా. ఇదీ ప్రభుత్వ యంత్రాంగం వద్ద వారి పలుకుబడి. మొత్తానికీ అయితే సార్ ను మాత్రం ఇలా అన్ని హంగుల్లోనూ వాడేస్తున్నారనే చర్చ ఎక్కడ చూసినా జోరుగా సాగుతోంది.
- సారు సేవలో...
సారుకు అన్నీ తానై వ్యవహరిస్తారు ఆ ముగ్గురు. వారు గొప్ప కృతజ్ఞతావాదులు. సారు రుణాన్ని వారెప్పుడూ ఉంచుకోరు. అలాని దాచు కోలేదు. సారు ఎటు వెళ్లినా ఆ ముగ్గురు కాన్వాయ్ వెనుక సీట్లోనే ఉంటరు. ఎటెళ్లినా వారిని సారు మరిచి ఉండరు. వెంట తీసుకెళ్తారు... సంధ్యా వేళా.. అలా కారులో వెళ్తున్నపుడు మధురమైన కావ్యం వింటూ సాగే ప్రయాణం.., ఆహ్లాదకరం సారుకు ఎంతో ఇష్టం... సారు అమూల్య సేవలు బెల్లంపల్లి నియోజక వర్గం ప్రజలకు ఈ మాత్రం అందుతున్నాయి అంటే ఆ ముగ్గురి పుణ్య మే... పాపం సార్ కు క్షణం తీరిక ఉండదు.
ప్రజలనన్నా విడిచిపెట్టి నెలల తరబడి బెల్లంపల్లికి దూరముంటారు కానీ వారి దూర భారాన్ని మాత్రం భరించలేరు. సారు బెల్లంపల్లికి రాకపోతే వారు కూడా ఈ గ్యాబ్ ను అస్సలు భరించలేరూ. అందుకని సారును కష్టపెట్టకుండా వారే హైదరాబాద్ కు వెళ్తుంటారు. సారు ఎదురు చూడక ముందే అక్కడికి చేరుతారు. సార్ తో ఆ ముగ్గురు వీడియో కాల్స్ చేసుకుంటారు. ఇక వాట్సాప్ మెసేజ్ లు, చాటింగ్ వారి మధ్య సంభాషణ అనునిత్యం.
కాగా పిచ్చి జనాలు, కొంతమంది కార్యకర్తలు వారినీ అపార్థం చేసుకుంటారు. ఆడిపోసుకుంటారు. ఇలాటి బుద్ధిమాంద్యం జనాలు ఉంటారనీ వాళ్లకూ తెలుసు. అందుకే పట్టించి కోరు... ప్రజా జీవితంలో సారుకు అలుపుండదు. అలసిసొలసినా సారు కు ఆ ముగ్గురు దగ్గరుంటే.. అలసట ఇట్టే తీరిపోతదనీ స్వయాన సారే కామీడీ చేస్తారు. ఇలా సేదతీరుతూ.. సారు క్షణం తీరిక లేకుండా ప్రజాహిత కార్యక్రమాల్లోనూ గడుపుతారు.
ఆ మాత్రం సేవలు సారు కు అందాలి కూడా. వయస్సు అయిపోంది కదా.. అందుకే కాబోలు వారి సేవలు సార్‌కు ఎనర్జీటానిక్‌లా పనిచేస్తున్నాయి. కావాల్సినం తగా ఉత్తేజ పరుస్తున్నాయి. అం దుకే సారు ఎప్పుడూ యువకుడిలా ఉషారుగా కనిపిస్తారు. ఇదే ఆ రహ స్యం. అందరిని నవ్విస్తారు. చేతుల్లో చెయ్యేసి మరీ పలకరిస్తారు. భుజం తడుముతారు.
ఈ మర్యాద పలకరింపుల్లో లింగ వివక్ష అస్సలు ఉండదూ... అందరూ సమానులే సారుకు. ప్రాధాన్యత క్రమంలో కార్యకర్తలైనా, పెద్ద లీడర్లైనా వారి స్థానం ఆ ముగ్గురి తరువాతనే అనడంలో అతిశయోక్తి లేదు. పాపం సారును కొంచెం అర్ధం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా..? ప్రజలను తప్పు పట్టరాదూ.. నియోజకవర్గం ప్రజలకివి కొత్తవికదా..? ఇప్పుడి ప్పుడే అర్ధం చేసుకోవడానికి ప్రజలు ప్రయ త్నం చేస్తూనే ఉన్నారు. కొంత సమయం పడుద్ది ప్రజలకు.. ఇంకెంత కాలం మహా అయితే మూడు సంవత్సరాలు.
కాలమాగుతదా.. ఆ ఎన్నికల్లో సారును ఇక ఎంత మా త్రం కష్టపెట్టకుండా ఎలా తీర్పు ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసు. సారుక్కూడా విశ్రాంతి అంటేనే ఎక్కువ ఇష్టం. ఈ మాత్రం బెల్లంపల్లి ప్రజలకు తెలియదా..? ఎంతో చైతన్య ఉన్న ఓటర్లుగా జిల్లాలో మంచి పేరున్నది. సారుకు ఇష్టమైందే కానుకగా ఇస్తారు. కాకపోతే మంత్రి కాలేదని ఓ చిన్న కోరిక తీరకపోవడం, సారును వేధిస్తున్న తీరని వ్యధ.
ఇది ఆ ముగ్గురినీ కూడా నిత్యం తెగబాధిస్తూనే ఉన్నది పాపం. ఏమి చేస్తాం రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరుగవు కదా.. ఒకటి మాత్రం నిజం. సారుకు మళ్ళీ వయసు తిరిగి రాదు. కానీ ఆ ముగ్గురికి మాత్రం మళ్ళీ చిన్నయ్య లాంటి వారికి దొరక్కుండా పోరు... ఎటొచ్చీ పాపం సారుకే ఆ అదృష్టం దక్క కుండా పోతదనీ ఊహించుకుంటేనే బాధ అనిపిస్తున్నది.