02-12-2024 12:00:00 AM
బీసీసీఐ చక్రం తిప్పేనో?
దుబాయ్: ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నూతన బాస్‌గా బీ సీసీఐ కార్యదర్శిగా జైషా ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 36 ఏండ్ల షా గత ఐదేళ్లుగా బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ పదవికి ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
ఐదో భారతీయుడు
ప్రస్తుత చైర్మన్ జై షా కంటే ముందు భారత్‌కు చెందిన బిజినెస్‌మెన్ జగన్మోహన్ దాల్మియా, రాజకీయ నాయకుడు శరద్ పవార్, లాయర్ శశాంక్ మనోహర్, పారిశ్రామిక వేత్త అయిన శ్రీనివాసన్‌లు ఈ పదవిలో కొనసాగారు. జైషా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొడుకు.