07-05-2025 12:30:09 AM
హుస్నాబాద్, మే 6 : భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖలో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ సంస్థాగత ఎన్నిక ల్లో భాగంగా, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా, అంకితభావం కలిగిన నాయకుడు బత్తుల శంకర్ బాబు అధ్యక్షుడిగా ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఆ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ మంగళ వారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. దశాబ్దకాలంగా పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న శంకర్ బాబు ఎన్నికపై హుస్నాబాద్ లోని ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నిక అనం తరం శంకర్ బాబు మాట్లాడుతూ ‘పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేయడమే నా లక్ష్యం. కార్యకర్తలందరి సహకా రంతో హుస్నాబాద్లో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను‘ అని ఉద్ఘాటించారు.
తనపై న మ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, రాష్ట్ర నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, దూది శ్రీకాంత్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమల, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు తోట స్వరూపకు కృతజ్ఞతలు తెలిపారు.