25-10-2024 12:00:00 AM
న్యూపోర్ట్ (అమెరికా): రష్యా టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా, అమెరికా డబుల్స్ ద్వయం బాబ్-మైక్ బ్రియాన్ అం తర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. 2025 హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన జాబితాను గురువారం ప్రకటించారు. 2020లో ఆటకు గుడ్ బై పలికిన షరపోవా మహిళల టెన్నిస్‌లో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్న పది మందిలో ఒకరిగా నిలిచింది. మైక్ బ్రియాన్-బాబ్ బ్రియాన్ ద్వయం డబుల్స్‌లో 16 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కొత్త చరిత్ర లిఖించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.