19-08-2025 02:02:40 AM
మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్ సారథ్యంలోని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సమర్పణ లో వస్తున్న కొత్త చిత్రం ‘రావు బహదూర్’. ఇందు లో హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఏఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోమవారం విడుదల చేశారు. జమీందారీ నేపథ్యంలో ఈ కథ సాగుతుం డగా, ఓ పాత కోటలో ఒంటరిగా జీవిస్తున్న హీరోను ఈ ‘నాట్ ఈవెన్ ఏ టీజర్’లో పరిచయం చేశారు.
తన ప్రత్యేకమైన నేరేషన్‌తో వెంకటేశ్ మహా మరోసారి తన స్టోరీటెల్లింగ్‌కి స్పెషల్ మార్క్ వేశారు. డ్రామా, సైకాలజికల్ థ్రిల్, డార్క్ హ్యూమర్ థ్రిల్ చేశాయి. హీరో సత్యదేవ్.. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు వేర్వేరు లుక్స్‌లో, వేర్వేరు భావాలతో కూడిన పాత్రలో కనిపించారు. వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి లాంటి ప్రధాన పాత్రలనూ ఈ టీజర్‌లో పరిచయం చేశారు. తెలుగుతోపాటు ఇతర భాషల సబ్‌టైటిల్స్‌తో 2026 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి; డీవోపీ: కార్తీక్ పర్మార్.