calender_icon.png 29 January, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్‌లో బీజేపీకి షాక్

29-01-2026 12:29:47 AM

సీనియర్ నేత అయ్యన్నగారి రాజేందర్ రాజీనామా

త్వరలో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి..

నిర్మల్, జనవరి ౨౮ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీ పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి దృష్టిపెట్టగా ఆ పార్టీ నేత బుధవారం రాజీనామా చేయడం చర్చనీయంశంగా మారింది. నిర్మల్ పట్టణం లో మూడుసార్లు వరుసగా విజయం సాధించిన అయ్యన్న గారి రాజేందర్ ఎమ్మెల్యే వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మున్సిపల్ వార్డులు చైర్మన్‌ల అభ్య ర్థుల ఎంపిక విషయంలో మహేశ్వర్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి కారణంగానే పార్టీకి రాజీనా మా చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.