29-01-2026 12:28:15 AM
నిజామాబాద్ జనవరి 28 (విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్ల లో ఒక టై న నిజామాబాద్ నగర మున్సిపల్ పోరుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పోటీ కై ఎన్నికల బరిలో కి దిగనున్న అహుత్సాహికులు దరఖాస్తు చేసుకునేందుకు నిజామాబాద్ కార్యాలయానికి పోటెత్తారు.
బుధవారం నుంచి నామినేషన్ లో దాఖలు ప్రక్రియ మొదలు కావడంతో అహుత్సాహికులు దరఖాస్తు ఫారాలతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి ఆర్మూర్ ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద.భీంగల్ బోధన్ లో నామినేషన్ పర్వం ప్రారంభమైంది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటుచేసిన 60 డివిజన్లకు గాను 3 48 0 5 1 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 180 5 4 6 మంది మహిళా ఓటర్లు కాగా 1,67,461 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో మొత్తం వార్డులు 49 కాగా 99 ,31 3 ఉంది ఓటర్లు ఉండగా 48 ,38 9 మంది పురుష ఓటర్లు కాగా 50 , 9 0 7 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం మొదలు కావడంతో కార్పొరేషన్ లో ఎన్నికల కై రాజకీయ పార్టీల కసరత్తు మొదలైంది. నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పై తమ తమ జెండా ఎగరవేయడానికి ప్రధాన పార్టీల నాయకులు తమ మేధస్సుకు పదం పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేట మొదలుపెట్టాయి.
నామినేషన్ల గడువు ఈనెల 30తో ముగియం ఉండడంతో రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగు వేస్తున్నాయి. బిజెపి కాంగ్రెస్ టిఆర్‌ఎస్ ఎంఐఎం పార్టీలు అన్ని వర్గాల ప్రజల మద్దతు కొరకై సాంప్రదింపులు జరిపి వారి అభిరుచి మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇదిలా ఉండగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీసు, ఫులాంగ్ టీటీడీ కల్యాణ మండపం, గౌతంనగర్, గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్, బడా బజార్ వాటర్ ట్యాంక్ తదితర కేంద్రాలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని నిశిత పరిశీలన చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు.
టీ.పోల్ యాప్ లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేస్తున్న వైనాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో అజాగ్రత్త వ్యవహరించొద్దని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు బోధన్ మున్సిపల్ ఎన్నికల విషయంలో సునీత ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేసి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రజాప్రతినిధులు అధికారులు ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలని ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.