28-09-2025 01:05:21 AM
-పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం
-వరల్డ్ నం1ను మట్టికరిపించిన శీతల్ దేవి
-మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం
గాంగ్జౌ, సెప్టెంబర్ 27: దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన పారా ఆర్చర్ శీతల్‌దేవి సత్తా చాటింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో శీతల్ దేవి స్వర్ణం సాధించింది. అలాగే కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో తుర్కియే చేతిలో ఓడిపోయి రజతం, తోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ ఈవెంట్లోని మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. రెండు చేతులు లేకున్నా కానీ శీతల్ దేవి మాత్రం సత్తా చాటింది. వరల్డ్ నం.1 ఆర్చర్ ఓజ్నూర్ క్యూర్ గిర్డిపై 146 తేడాతో శీతల్ దేవి జయకేతనం ఎగరేసింది. ఇక మిక్స్‌డ్ టీమ్ విభాగం కాంస్య పతక పోరులో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన గ్రిన్‌హామ్, నాథన్ మాక్‌క్వీన్‌ల జోడీని 152 శీతల్‌దేవి జోడీ మట్టికరిపించింది.
రెండు చేతులు లేకున్నా..
ముచ్చటగా మూడు పతకాలు కొల్లగొట్టిన 18 ఏండ్ల శీతల్‌దేవికి రెండు చేతులు లే వు. శీతల్‌దేవి 2007లో జమ్మూకశ్మీర్‌లోని కిష్తావర్‌లోని జన్మించింది. పుట్టడమే చేతులు లేకుండా పుట్టిన శీతల్‌దేవి ఆర్చరీ లో ఎన్నో రికార్డులు తన పేర లిఖించుకుంటోంది. 2024 పారిస్ పారాలంపిక్స్‌లో కాం స్య గెల్చుకుని అతిపిన్న వయస్సులో ఒలింపిక్ మెడల్ గెలిచిన భారతీయ ఆర్చర్‌గా రికార్డులకెక్కింది. శీతల్‌దేశి ‘ఫోకోమెలియా’ అనే రేర్ డిసీజ్‌తో జన్మించింది.