28-10-2025 01:10:09 AM
ముంబై, అక్టోబర్ 27 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ ప్రతీకా రావల్ వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేశారు. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపింది. గురువారం ఆసీస్‌తో భారత్ సెమీ స్‌లో తలపడనుండగా.. షెఫాలీ వర్మ మంగళవారం జట్టుతో చేరనుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రతీకా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడింది.
బౌండరీ దగ్గర బం తిని ఆపే క్రమంలో కాలి మెలిపడింది. నడవలేని స్థితిలో ఫిజియో, సహచరుల సాయం తో మైదానాన్ని వీడింది. వైద్యులు ఆమెకు విశ్రాంతి అవసరమని సూచించడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా రీప్లేస్‌మెంట్‌గా ఎంపికైన షెఫాలీ ప్రస్తుతం సీనియర్ వుమెన్స్ టీ20 లీగ్‌లో టాప్ రన్ స్కోరర్‌గా ఉంది. ప్రపంచకప్‌కు ముందు ఫామ్ కోల్పోవడంతో షెఫాలీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. వుమెన్స్ టీ20 లీగ్‌లో షెఫాలీ 7 ఇన్నింగ్స్‌లలో 341 పరుగులతో రాణించడం ద్వారా ఇప్పుడు ప్రతీకా స్థానంలో ఎంపికైంది.